నేడు శ్రీకాకుళానికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మూలపేట పోర్ట్ పనులకు జగన్ నేడు భూమి పూజల చేయనున్నారు. 179 కోట్ల రూపాయల వ్యయంతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు, 852 కోట్ల రూపాయల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
శంకుస్థాపనలు...
ఉదయం ఎనిమిది గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి జగన్ 10.30 గంటలకు మూల పేట గ్రీన్ ఫీల్డ్ పోర్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే గంగమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కార్కక్రమాలను ముగించుకుని 3.25 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. జగన్ సభ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన భద్రతను కల్పించారు.