Ys Jagan : నేడు బెజవాడకు జగన్... ట్రాఫిక్ ఆంక్షలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కనకదుర్గ వారధి వద్ద నీటిపారుదల శాఖ రిటైనింగ్ వాల్ తో పాటు రివర్ ఫ్రంట్ డెవలెప్‌మెంట్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. అలాగే విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి వాటిని లబ్దిదారులకు అందచేయనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగన్ కృష్ణలంక సమీపంలోని కనకదుర్గ వారధికి చేరుకుంటారు.
ఉదయం 8 గంటల నుంచే...
అక్కడ రిటైనింగ్ వాల్‌తో పాటు రివర్ ఫ్రంట్ డెవలెప్‌మెంట్‌ను ప్రారంభింస్తారు. అనంతరం పేదలకు పట్టాలను అందచేయనున్నారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.