జగనన్నా ఇంతటి ద్రోహం చేస్తావా?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు

Update: 2024-05-03 06:11 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆమె మీడియా సమావేశంలో కడపలో మాట్లాడారు.ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ తీరని అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే..జగన్ మాత్రం ద్రోహం చేశారన్నారు. ఈ ప్రభుత్వ తీరు చాలా బాధాకరంగా ఉందని, గౌరవంగా బ్రతకాల్సిన ఉద్యోగులను అవమానిస్తున్నారని అన్నారు. బొత్స లాంటి వాళ్ళు కాళ్లు పట్టుకొని అడగాలని అంటున్నారని, ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారన్నారు. ఉద్యోగుల హక్కులు కాలరాస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయడం లేదన్న వైఎస్ షర్మిల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.

అధికారంలోకి వచ్చాక...
అధికారంలో వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ ను రద్దు చేసి...జీపీఎస్ విధానం అమలు చేస్తామని చెప్పారని, ఎందుకు చేయలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జీపీఎస్ అవసరం లేదని, తమకు కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తెచ్చిన ఓపీఎస్ విధానం అమలు చేయాలి అంటున్నా ఎందుకు వినడం లేదని షర్మిల అన్నారు. ఒకటో తారీకు న జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు...ప్రతి నెల 15 నుంచి 25 మధ్యలో జీతాలు అందుకోవడం ఎంటి అని నిలదీశారు. ఇది అసమర్థ పాలనకు నిదర్శనం కాదా అంటూ ప్రశ్నలు సంధించారు.పెన్షన్ పంపిణీ పేరుతో వృద్ధులను చంపుతున్నారన్నారు. ఐఏఎస్ లు ప్రభుత్వానికి, వైసీపీకి మేలు చేస్తున్నారన్నారు.


Tags:    

Similar News