Pawan Kalyan : ఆ ఆలోచనే నన్ను ఈ స్థాయికి చేర్చింది
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. స్వతంత్రం వచ్చిందని ఆనంద పడే కంటే దేశ బాధ్యతను గుర్తుచేసుకునే రోజు అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు భద్రత కల్పిస్తామని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.
కొత్త నాయకత్వం....
ఆ ఆలోచనే తనను ఈ పదవిలో కూర్చోబెట్టిందని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో పాటు ఎర్రచందనం వేలం వేసి కర్ణాటక ప్రభుత్వం ఆ డబ్బును సంక్షేమ పథకాలను వినియోగించిందన్నారు. కానీ ఇక్కడ ఎర్ర చందనం మాత్రం దొంగల బారిన పడుతుందన్నారు. కొత్త నాయకత్వం తయారు కావాలన్న ఆయన తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. తనకు కొన్ని పరిమితులున్నాయని, దాని మేరకే పని చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.