Pawan Kalyan : నేడు విజయవాడకు పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ నేడు విజయవాడకు రానున్నారు.;

Update: 2024-06-18 03:57 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ నేడు విజయవాడకు రానున్నారు. ఆయన తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయాన్ని తొలుత పరిశీలించనున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి చేరుకోనున్న పవన్ కల్యాణ్ అక్కడ తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలిస్తారు. పవన్ కల్యాణ్ కు సచివాలయంలోని సెకండ్ ఫ్లోర్ లో ఛాంబర్ ను ప్రభుత్వం కేటాయించింది.

సెక్రటేరియట్‌కు...
సమావేశాలకు, సమీక్షలకు అనుగుణంగా పవన్ కల్యాణ్ ఛాంబర్ ను అధికారులు తీర్చి దిద్దారు. దీనిని పరిశీలించిన తర్వాత ఏవైనా మార్పులు చేయాలని భావిస్తే అధికారులకు పవన్ కల్యాణ్ సూచించనున్నారు. పవన్ కల్యాణ్ మంత్రిగా రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. పవన్ కల్యాణ‌్ కు పంచాయతీరాజ్, మానవ వనరుల అభివృద్ధి శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News