ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకమా? లేదే?
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా సర్కార్‌కు వ్యతిరేకంగా లేరన్నారు;
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా లేరన్నారు. కేవలం పదిహేను శాతం మంది ఉద్యోగులు మాత్రమే వైసీపీకి వ్యతిరేకంగా ఉండవచ్చని కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలొస్తేనే...
వచ్చేఎన్నికల్లో అశోక్ గజపతిరాజు పోటీ చేసినా గెలిచే అవకాశం లేదన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు స్వయంగా ప్రచారం చేయలేదా? మరి ఆ ఎన్నికల్లో ఎందుకు టీడీపీ గెలవలేకపోయిందని కోలగట్ట వీరభద్ర స్వామి ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే అశోక్ గజపతిరాజు రోడ్డు మీదకు వస్తారని ఆయన అన్నారు. తాము జనంలోకి వెళితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.