Ap Elections : పార్టీ మారి కొందరు అదృష్టాన్ని వెతుక్కోగా.. మరికొందరికి దురదృష్టం తలుపు తట్టిందే

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెల్లడయ్యాయి. అనేక మంది పార్టీలు మారి కొందరు గెలిచి అదృష్టాన్ని దక్కించుకున్నారు

Update: 2024-06-05 04:32 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెల్లడయ్యాయి. అనేక మంది పార్టీలు మారి కొందరు గెలిచి అదృష్టాన్ని దక్కించుకున్నారు. మరికొందరు మాత్రం పార్టీ మారి దురదృష్టాన్ని వెతుక్కున్నట్లయింది. ఇలా వైసీపీ తిరస్కరించిన వారు తమ లక్ ను పరీక్షించుకోవడానికి పార్టీలు మారాల్సి వచ్చింది. అదే వారికి వరంగా మారింది. మరికొందరికి అది శాపంగా మారింది. అందుకే రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ప్రజలు ఒకలా ఆలోచించరు. ఇదే విషయం ఈ ఎన్నికల్లో స్పష్టమయింది.

టిక్కెట్ నిరాకరించడంతో...
వైసీపీ అధినేత జగన్ టిక్కెట్ ను నిరాకరించడంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగారు. ఒంగోలు పార్లమెంటులో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత టీడీపీ గెలిచింది. ఆయనకు టిక్కెట్ ను నిరాకరించడంతోనే టీడీపీ ఆహ్వానించి మరీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆయన లక్కీ ఫెలోగా మారారు. మరొక కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన తాను చెప్పిన వారికి అసెంబ్లీ సీటు ఇవ్వాలని పట్టుబట్టడంతో జగన్ వినలేదు. దీంతో ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసి నెల్లూరు ఎంపీగా గెలిచారు. నెల్లూరులో సుదీర్ఘకాలం తర్వాత ఎంపీ అయ్యారు.
మారాలని చెప్పడంతో...
ఇక నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరుకు వెళ్లాలని జగన్ కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించారు. తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని చెప్పారు. దీంతో అది కుదరదని జగన్ చెప్పడంతో టీడీపీలోకి మారి నరసరావుపేట టిక్కెట్ అందిపుచ్చుకున్నారు. రెండో సారి నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచి అదృష్టాన్ని వెతుక్కున్నారు. మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి వైసీపీలో ఇమడలేక చివరి నిమిషంలో జనసేనలో చేరారు. ఆయన మరోసారి మచిలీపట్నం నుంచి విజయం సాధించారు. వైసీపీలో ఉండి ఉంటే ఓటమిని చవి చూసేవారే. పార్టీ మారడంతోనే విజయం సాధ్యమయింద.ి
పార్టీ మారి....
ఇక విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేనినాని టీడీపీ నుంచి వైసీపీలోకి మారి దురదృష్టవంతుడయ్యారు. ఆయన రెండు సార్లు టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా గెలిచారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా కొందరు పార్టీ మారి అదృష్టాన్ని వెతుక్కోగా, మరికొందరు దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక రాజోలు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ పార్టీ మారి అమలాపురం పార్లమెంటు నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 
టీడీపీ ఎంపీ సీట్లు
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
విజయనగరం – అప్పలనాయుడు కలిశెట్టి
విశాఖ – శ్రీభరత్
అమలాపురం – హరీశ్
ఏలూరు – పుట్టా మహేశ్ కుమార్
విజయవాడ – కేశినేని చిన్ని
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల – కృష్ణ ప్రసాద్ తెన్నేటి
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
నంద్యాల – బైరెడ్డి శబరి
కర్నూలు – నాగరాజు పంచలింగాల
అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ
హిందూపురం – పార్థసారథి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద రావ్
వైసీపీ ఎంపీలు
అరకు – గుమ్మ తనుజా రాణి
కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి
తిరుపతి – గురుమూర్తి
రాజంపేట – మిథున్ రెడ్డి
బీజీేపీ ఎంపీలు
రాజమండ్రి - దగ్గుబాటి పురంద్రీశ్వరి
అనకాపల్లి - సీఎం రమేష్
నరసాపురం - శ్రీనివాసవర్మ
జనసేన ఎంపీలు
కాకినాడ - తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
మచిలీపట్నం - వల్లభనేని బాలశౌరి


Tags:    

Similar News