Andhra Pradesh : మద్యం దరఖాస్తుల ద్వారా ఆదాయం ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం దరఖాస్తుల ద్వారా భారీగానే ఆదాయం లభించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం దరఖాస్తుల ద్వారా భారీగానే ఆదాయం లభించింది. మద్యం కొత్త విధానంలో మద్యం దుకాణాలను సొంతం చేసుకోవడానికి లిక్కర్ వ్యాపారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. అయితే ఈ దరఖాస్తులు పెద్దయెత్తున వచ్చాయి. ప్రభుత్వం అంచనాలకు అనుగుణంగానే దరఖాస్తులు కూడా అందాయి.
1,700 కోట్లకు పైగానే...
రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకు గాను ఈరోజు రాత్రి ఏడు గంటలకు దాదాపు ఎనభై ఐదు వేల దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి 1700 కోట్ల రూపాయల ఆదాయం లభించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు దరఖాస్తుల ద్వారా అందుతుందని భావించిన ఈ మేరకు ఆదాయం రావడం పట్ల అధికార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల నుంచి దరఖాస్తులు ఎన్ని వచ్చాయన్నది అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.