జీవో నెంబర్-1 పై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్

జీవో నెంబర్-1 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.;

Update: 2023-01-17 12:09 GMT

జీవో నెంబర్-1 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. జీవో నెంబరు వన్ పై హైకోర్టు స్టే విధించడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీవో నెంబరు 1 సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. సీపీఐ నేత రామకృష్ణ వేసిన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఈ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

హైకోర్టు తీర్పుపై...
జీవో నెంబర్ 1 ప్రకారం జాతీయ, మున్సిపల్, రాష్ట్ర రహదారులపై ఎలాంటి పబ్లిక్ మీటింగ్ లు పెట్టరాదని, ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతనే బహిరంగ స్థలంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జీవో నెంబరు 1ను ఏపీ ప్రభుత్వం తెచ్చింది. కందుకూరు, గుంటూరులో జరిగిన చంద్రబాబు సభల్లో పదకొండు మంది మరణించడంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ జీవోను తెచ్చింది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


Tags:    

Similar News