Ap Super Six : సూపర్ సిక్స్ అమలు కావాలంటే ఎన్ని కోట్లు కావాలో తెలుసా? అది ఇప్పట్లో సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక వనరుల సమీకరణలో అధికారులున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలోనూ చంద్రబాబు నాయుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. తాము సూపర్ సిక్స్ ను అమలు చేసి తీరుతామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నామని చెప్పిన ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు వెళ్లబోమని తెలిపారు. సూపర్ సిక్స్ లో అనేక హామీలున్నాయి. అందులో పింఛన్లు అమలు చేశారు. నెలకు నాలుగు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం విజయం సాధించిన మరుసటి నెల నుంచే అమలు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతుంది. దీపావళికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఏడాదికి మూడు వేల రూపాయలు ఖర్చవుతుంది. జనవరి నెల నుంచి అమలు చేయాలని భావిస్తున్న తల్లికి వందనం పథకానికి పదిహేడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది.