ఐపీఎస్ అధికారి సంజయ్ విచారణకు అనుమతి
సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‍ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది
సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‍ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఫైర్ డీజీ, సీఐడీ ఏడీగీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‍ఫోర్స్ మెంట్ విభాగం నివేదిక ఇవ్వడంతో ఆయనపై విచారణకు అనుమతి ఇచ్చింది. సాక్షాధారాలతో ఉన్న నివేదికను పరిశీలించిన ప్రభుత్వం వెంటనే ఐపీఎస్ అధికారి సంజయ్‍ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఏసీబీ వినతితో...
విజిలెన్స్ నివేదికను ఏసీబీకి పంపి విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సంజయ్‍ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి అవినీతి నిరోధక శాఖ అధికారులు లేఖ రాశారు. ఏసీబీ విజ్ఞప్తిని పరిశీలించి సంజయ్ ప్రాసిక్యూషన్‍కు జీఏడీ అనుమతిని మంజూరు చేసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now