Perni Nani : పేర్నినానికి పోలీసులు నోటీసులు
మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కృష్ణమూర్తికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే మచిలీపట్నంలోని ఆయన నివాసంలో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. నేడు విచారణకు రావాలని పోలీసులు పేర్ని నానికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
రేషన్ బియ్యం మాయం కావడంతో...
పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉంచిన రేషన్ బియ్యం మాయం కావడంతో ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదయింది. ప్రధానంగా పేర్ని నాని భార్య జయప్రద పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు పేర్ని నాని కుటుంబం మాత్రం పోలీసులకు కన్నుగప్పి అజ్ఞాతంలోకి వెళ్లింది. దీంతో నోటీసులు ఇచ్చి దీనిపై విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈరోజు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లకు డాక్యుమెంట్లతో రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now