Breaking : ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకపంనలు
ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకపంనలు తలెత్తాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకపంనలు తలెత్తాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ముండ్లమూరు మండలంలో స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు ప్రజలు తెలిపారు. దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిన్న ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరులో భూప్రకపంనలు సంభవించిన సంగతి తెలిసిందే.
ఇరవై నాలుగు గంటలు గడవకముందే...
కానీ ఇరవై నాలుగు గంటలు గడవకముందే మరోసారి భూప్రకంపనలు రావడం భయాందోళనలకు గురి చేస్తుంది. వరసగా రెండు రోజుల పాటు భూ ప్రకంపనలు ఈ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇళ్లల్లో ఉన్న సామాన్లు కదలడం, కొన్ని గోడలకు క్రాక్ లు రావడంతో దీనిని భూకంపంగా గుర్తించారు. అయితే అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now