Purandhreswari : అల్లు అర్జున్ ను వెనకేసుకొచ్చిన చిన్నమ్మ
సంథ్య థియేటర్ లో జరిగిన ఘటనపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి స్పందించారు
సంథ్య థియేటర్ లో జరిగిన ఘటనపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్న పురంద్రీశ్వరి ఈ ఘటన యాథృచ్ఛికంగానే జరిగిందన్నారు. అల్లు అర్జున్ కావాలని తొక్కిసలాటకు కారణం కాలేదని తెలిపారు. అయినా సంథ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఏ 11 గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడమేంటని పురంద్రీశ్వరి ప్రశ్నించారు.
మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా...
మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో ఆంతర్యమేంటని పురంద్రీశ్వరి ప్రశ్నించారు. అనుకోని ఘటనలో అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడం సరికాదన్న పురంద్రీశ్వరి న్యాయపరంగా కేసులు ఆ కుటుంబం ఎదుర్కొంటుందని తెలిపారు. ఒక హీరోగా అల్లు అర్జున్ ఆ థియేటర్ కు వెళ్లారని ఆమె అన్నారు. జమిలి ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మళ్లీ పార్లమెంటులో ఓటింగ్ పెడతారని పురంద్రీశ్వరి ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now