ఉద్యోగులకు షాకిచ్చిన ప్రభుత్వం

ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రేపు ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో సెలవు ఇవ్వవద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది.

Update: 2022-02-02 12:18 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. రేపు ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో సెలవు ఇవ్వవద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది. అత్యవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని సూచించింది. గురువారం అందరూ ఉద్యోగులు విధుల్లో ఉండేలా చూడాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని ఉన్నతాధికారులకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయి.

చలో విజయవాడకు....
రేపు ఉద్యోగ సంఘాల నేతలు చలో విజయవాడకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. పీఆర్సీ కొత్త జీవో రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టాలని, పాత జీతాలను వేయవద్దని మూడు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినా వాటిని పట్టించుకోలేదు. దీంతో రేపు చలో విజయవాడ కార్యక్రమానికి లక్షలాది మంది తరలిరావాలిని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.దీంతోనే జిల్లా కలెక్టర్ల నుంచి రేపు ఎవరికీ సెలవు ఇవ్వవద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి.


Tags:    

Similar News