Andhra Pradesh : జులై 1న ఇంటివద్దకే పింఛను.. గుడ్ న్యూస్ చెప్పిన కేబినెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

Update: 2024-06-24 07:08 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. జులై ఒకటోతేదీ నుంచి పెంచిన పింఛనును అమలు చేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. జులై నుంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛను చెల్లించనున్నారు. జులై ఒకటోతేదీన ఇంటివద్దకే పింఛను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

హామీ ఇచ్చిన మేరకు...
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన వెయ్యి చొప్పున బకాయీలు కలిపి జులై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పింఛనుదారులకు ప్రభుత్వం చెల్లించనుంది. దాదాపు అరవై ఐదు లక్షల మంది లబ్దిదారులు పింఛను రూపంలో ప్రయోజనం పొందనున్నారు. కేబినెట్ ఆమోదం తెలపడంతో ఇక పింఛను మొత్తం పంపిణీకి అధికారులు సిద్ధం కావాల్సిందే.


Tags:    

Similar News