Breaking: అంగన్ వాడీ వర్కర్లకు ప్రభుత్వం అల్టిమేటం..విధుల్లో చేరకుంటే?
అంగన్‌వాడీ వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. చివరి అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది
అంగన్‌వాడీ వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. చివరి అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లో చేరాలని ఆదేశించింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్లు ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం దిగి వచ్చినా సమ్మె విరమణకు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం సీరియస్ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వం బహిరంగ లేఖను కూడా విడుదల చేసింది.
విధులు హాజరుకాకుంటే...
అంగన్ వాడీ వర్కర్లు విధుల్లో చేరాలని, విధుల్లో చేరని వారి జాబితాను రూపొందించాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంగన్ వాడీ వర్కర్ల సమ్మెతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గర్భిణులు, శిశువులు పౌష్టికాహారం అందక ఇబ్బంది పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరు కాకుంటే చర్యలు తీసుకునేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతుంది. దీనిపై అంగన్ వాడీ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.