ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ కు ఊరట
ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది.
ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో ఘర్షణలు జరగడంతో అప్పడు పల్నాడు ఎస్పీగా ఉన్న బిందుమాధవ్ ను విధుల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే నాడు జరిగిన ఘర్షణలపై ఎన్నికల కమిషన్ కు వివరణ ఇవ్వడంతో ఎన్నికల తర్వాత సస్పెన్షన్ ను ఎత్తివేసింది.
సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ...
తాజాగా ఆయనపై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ ను వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు తదుపరి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. బిందు మాధవ్ కు ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. విధుల్లోకి తీసుకోవాలని మాత్రమే నిర్ణయించింది. దీంతో ఆయనకు ఊరట లభించినట్లయింది.