ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ పింఛన్లను పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది.

Update: 2022-11-17 04:54 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ పింఛన్లను పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. పింఛన్లు అర్హులకు అందుతున్నాయా? అనర్హులు ఎవరైనా ఉన్నారా? అన్న దానిపై విచారణకు సిద్ధమయింది. దివ్యాంగుల పింఛన్లను పరిశీలించే బాధ్యత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది.

దివ్యాంగుల పింఛన్లపై...
గతంలోనూ అనేక పింఛన్లపై ప్రభుత్వం వడపోత చేసి కొందరు అనర్హులకు ఇస్తున్న పింఛన్లను తొలగించింది. ఇప్పుడు దివ్యాంగ పింఛన్లలో కూడా అనర్హులు ఉన్నారని తెలిసి విచారణకు ఆదేశిచింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6.50 లక్షల మంది దివ్యాంగులు పింఛన్లను అందుకుంటున్నారు. వీరిలో అర్హులు ఎంతమంది? అనర్హులు ఎంతమంది? అన్నది అధికారులు తేల్చి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.


Tags:    

Similar News