Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... ఇసుక ఫ్రీగా తీసుకెళ్లొచ్చు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్కడి నుంచైనా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్కడి నుంచైనా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపింది. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అయితే ఎవరికి వారు తాము తెచ్చుకున్న వాహనంలో లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఉచితను ఎటువంటి రుసుం లేకుండానే తీసుకెళ్లవచ్చని, అంతేకాదు ఎవరికీ పైసా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. సొంత అవసరాల కోసం ఎవరైనా ఉపయోగించుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
రాష్ట్ర అవసరాల కోసమే...
రాష్ట్ర అవసరాలకు ఎంత అవసరమైనా ఇసుకను తీసుకోవచ్చని నిర్ణయించింది. అయితే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు మాత్రం అంగీకరించబోమని తెలిపారు. ఇసుకను ఉచితంగా తీసుకుని కర్ణాటక, తెలంగాణకు తీసుకెళ్లి విక్రయించాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారిపై పీడీ యాక్ట్ పై కూడా పెడతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. జగన్ తన సొంత లారీని తీసుకు వచ్చి ఉచితంగా తీసుకెళ్లినా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదన్నారు. లారీల్లో కూడా వారే లోడ్ చేసుకుంటే ఎవరికీ పైసా చెల్లించాల్సిన పనిలేదని చెప్పారు