Andhra Pradesh : గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు రేపటి నుంచే అమల్లోకి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాల ధలను తగ్గించింది

Update: 2024-07-31 12:09 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖ నుంచి పంపిణీ చేసే బియ్యం, కందిపప్పు ధరలను తగ్గిస్తూ పేద ప్రజలకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కిలో కంది పప్పు ధర బహిరంగ మార్కెట్ లో 160 రూపాయలు ఉండగా, ఇక రేషన్ దుకాణాల్లో 150 రూపాయలకే అందించనున్నారు. కిలో కు పది రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

బియ్యం.. కందిపప్పు...
అలాగే నాణ్యమైన సన్న రకం బియ్యాన్ని కూడా తగ్గించారు. బియ్యం కిలో ధర నలభై ఎనిమిది రూపాయలు ఉండగా, దానిపై మాత్రం ఒక రూపాయి మాత్రమే తగ్గించారు. అంటే ఇక కిలో 47 రూపాయలుకే రేషన్ దుకాణాల్లో ఇవ్వనున్నారు. రైతు బజార్లలో వీటి పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు నిత్యావసరాల ధరలను తగ్గించిందని చెప్పారు. రేపటి నుంచి తగ్గిన ధరలతో కందిపప్పు, బియ్యాన్ని రైతు బజార్లలో విక్రయిస్తారని మంత్రి నాదెండ్ల తెలిపారు.


Tags:    

Similar News