Andhra Pradesh : ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై వేటు
ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటూ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వారిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారి నిర్లక్ష్యం పై ఉన్నతాధికారుల నుంచి నివేదికలు కోరారు.
ఉత్తర్వుల జారీ...
డిప్యూటీ కలెక్టర్లు పి.శ్రీలేఖ, ఏ.మురళి, ఓ.రాంభూపాల్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు సీఎస్ జవహర్ రెడ్డి జారీ చేశారు.