Andhra Pradesh : ఏపీ సర్కార్ రేపు గుడ్ న్యూస్ చెప్పనుందా? వారందరీకీ తెల్ల రేషన్ కార్డులేనట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపు రంగు రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమయింది. కొత్త రేషన్ కార్డుదారులకు నిజంగా ఇది శుభవార్త.

Update: 2024-10-09 06:56 GMT

new ration cards in AP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపు రంగు రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమయింది. కొత్త రేషన్ కార్డుదారులకు నిజంగా ఇది శుభవార్త. గత కొంతకాలంగా రేషన్ కార్డుల కోసం ఏపీలో అనేక మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1.30 కోట్ల తెలుపు రంగు రేషన్ కార్డులున్నాయి. వీరిలో అర్హులైన వారున్నారు. అర్హత లేని వారున్నారు. వారందరినీ తొలుత ఏరివేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసం ఉంటూ ఇక్కడ తెలుపు రంగు రేషన్ కార్డులు పొందుతూ అనేక ప్రయోజనాలను అందుకుంటున్నారు. తొలుత వీరిలో అనర్హులను ఏరివేసే కార్యక్రమం ఏపీ అధికారులు చేపట్టనున్నారు.

కొత్త రేషన్ కార్డులు...
అయితే తాజాగా రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేయడానికి కూడా ఏపీ సర్కార్ సిద్ధమయింది. ఇందులో మార్పులు, చేర్పులు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపుతో పాటు, కొత్త సభ్యుల పేర్లను చేర్చుకునే వీలుంది. అలాగే అడ్రస్ మార్పు కూడా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకోవచ్చు. వీటన్నింటికీ ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వనియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. రేషన్ కార్డుదారులు నకిలీగా పొందిన వారు అనేక మంది ఉండటంతో వారిని గుర్తించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
తెలుపు రంగు రేషన్ కార్డులు పొందాలంటే...?
తెలుపు రంగు రేషన్ కార్డులు పొందాలంటే నెలవారీగా పదివేల రూపాయల ఆదాయం రూరల్ ప్రాంతాల్లో ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలకు మించకూడదు. గత ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను విధించింది. అయితే ఈనిబంధనతో అనేక మంది తెలుపు రంగు రేషన్ కార్డులు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా అట్టడుగున ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల జీతం దాటడంతో వారు తెలుపు రంగు రేషన్ కార్డులకు అనర్హలుగా గత ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో వీరికి గుడ్ న్యూస్ చెప్పనుందట ప్రభుత్వం.
ప్రభుత్వ పథకాలకు...
వారంతా ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వారికి సానుకూలమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతో తెలుపు రంగు రేషన్ కార్డులు అంగన్‌వాడీలకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చి వారిని కూడా ప్రభుత్వపథకాలకు అర్హులుగా చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నట్లేనని వారు చెబుతున్నారు. మంత్రివర్గ సమావేశంలో సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని వారు ఇప్పటికే కొందరు మంత్రులను కలసి తమ సమస్యలపై వినతి పత్రాలను అందచేశారు.
Tags:    

Similar News