రాజధానిపై మరోసారి ఏపీ సర్కార్
రాజధాని అమరావతిపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.;
రాజధాని అమరావతిపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈరోజు ఉదయం జస్టిస్ కేఎం జోసెస్, స్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ముందు ప్రస్తావించనుంది. అమరావతి పై హైకోర్టు తీర్పు విషయంలో వెంటనే విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరనుంది.
మార్చి 28న విచారణ ....
ఇప్పటికే ప్రతివాదులైన రైతుల తరుపున న్యాయవాదులకు మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. గత సోమవారం జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఈ నెల 28వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం చెప్పింది. అయినా మరోసారి ధర్మాసనం ముందు అమరావతి విచారణను త్వరితగతిన చేపట్టాలని నేడు ధర్మాసనాన్ని కోరనుండటం విశేషం.