ప్రభుత్వం ఎస్మా తో.. ఎంప్లాయీస్ అన్ ఇన్ స్టాల్ తో...?

రాష్ట్రంలో ఎస్మాను ప్రయోగించడానికి ఉన్న అవకాశాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది

Update: 2022-02-04 12:43 GMT

రాష్ట్రంలో ఎస్మాను ప్రయోగించడానికి ఉన్న అవకాశాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అవసరమైతే ఎస్మాను ప్రయోగించాలని భావిస్తుంది. అత్యవసర సేవలకు మాత్రం తాము మినహాయించామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ప్రజా రవాణా, విద్యుత్తు, పారిశుద్ధ్య సిబ్బంది వంటి వాటి అత్యవసర సేవలు అందించే శాఖలపై ఎస్మాను ప్రయోగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది.

మొబైల్ అప్లికేషన్స్ తో.....
ీఈ నెల 6వ తేదీ నుంచి ఉద్యోగుల సమ్మె ప్రారంభమవుతుంది. దీంతో జగన్ ఆర్థిక శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్లతో అధికారులతో జగన్ చర్చిస్తున్నారు. హెచ్ఆర్ఏ, పీఆర్సీ వంటి వాటిపై జగన్ చర్చిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ సంఘలు సయితం సమ్మె తీవ్రతను తొలి రోజే తెలియజేసేందుకు సిద్ధమయ్యాయి. విద్యాశాఖ, కో్-ఆపరేటివ్, ఐసీడీఎస్, వైద్య శాఖ మొబైల్ అప్లికేషన్ లు అన్ ఇన్ స్టాల్ చేయనున్నారు. దీంతో పాలన స్థంభించి పోతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహకారం అందదు. దీంతో ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు


Tags:    

Similar News