ఏపీ ఐఏఎస్ కు జైలు శిక్ష

కోర్టు థిక్కరణకు పాల్పడినందుకు ఏపీ హైకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది;

Update: 2023-01-18 07:33 GMT

కోర్టు థిక్కరణకు పాల్పడిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఇద్దరు ఉన్నతాధికారులకు జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించింది. ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ , ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణలకు నెల రోజుల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానాను విధించింది.

విద్యాశాఖలో...
ఈ శిక్షలను వెంటనే అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని సూచించింది. గతంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన బుడితి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ గా పనిచేసిన రామకృష్ణలు కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే రాజశేఖర్ సెలవుపై ఉన్నారు. రామకృష్ణ ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఐజీ గా ఉన్నారు.


Tags:    

Similar News