ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. 8 మంది ఐఏఎస్ లకు శిక్ష
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎనిమిది మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎనిమిది మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయొద్దంటూ హైకోర్టు తీర్పును అమలు చేయని ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. కోర్టు థిక్కరణ కేసు కింద ఈ తీర్పు చెప్పింది. అయితే ఐఏఎస్ అధికారులు జైలు శిక్షకు బదులు ప్రత్యామ్నాయంగా సేవ చేయాలని ఆదేశించింది.
రెండు వారాల జైలు శిక్ష....
ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్, రాజశేఖర్, చిన వీరభద్రుడు, జె. శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్, విజయ్ కుమార్ లకు కోర్టు థిక్కరణ కింద రెండు వారాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే ఐఏఎస్ అధికారులు న్యాయస్థానాన్ని క్షమాపణ కోరడంతో జైలు శిక్షకు బదులు ఏడాది పాటు ప్రతి నెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్ కు వెళ్లి సేవ చేయాలని, ఒక పూట భోజనం ఖర్చు భరించాలని హైకోర్టు ఐఏఎస్ అను ఆదేశించింది.