ఏపీ సర్కార్ పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

రుషికొండ అక్రమ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు కొండలను తొలుస్తున్నారని వ్యాఖ్యానించింది.

Update: 2022-10-13 07:42 GMT

రుషికొండ అక్రమ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు కొండలను తొలుస్తున్నారని వ్యాఖ్యానించింది. అభివృద్ధి పేరిట కొండలను తొలుస్తున్నారని అభిప్రాయపడింది. మరో వైపు అభివృద్ధి కోసం పాదయాత్రలు చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమని అంట మేంటని ప్రశ్నించింది. ప్రభుత్వంలో విభిన్న వైఖరులేంటి అని హైకోర్టు ప్రశ్నించింది.

కేంద్రం నుంచి...
కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామంటే ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని నిలదీసింది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వం ఏదో దాస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పింది. కేసు విచారణను నవంబరు 3వ తేదీకి వాయిదా వేశారు.


Tags:    

Similar News