Buggana : చంద్రబాబు విజన్ .. కూటమిలో ప్రశ్నిస్తానన్న ఆయనేరీ?
చంద్రబాబు విజన్ 2047 అని చెబుతుంటే ప్రజలు విసిగిపోతున్నారని మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు
చంద్రబాబు విజన్ 2047 అని చెబుతుంటే ప్రజలు విసిగిపోతున్నారని మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది చంద్రబాబుకు ఐదేళ్లు మాత్రమేనని, అయితే విజన్ మాత్రం 2047 వరకూ ఉందని ఉన్నారు. అప్పులు చేసి మరీ సంపదను సృష్టిస్తున్నారంటూ బుగ్గన ఎద్దేవా చేశారు. తమ హయాంలో 13 శాతం మాత్రమే అప్పులు చేస్తే, ఇప్పుడు 43 శాతం అప్పులు చేశారని ఆరోపించారు. కేవలం అమరావతి పేరుతోనే 31 వేల కోట్లరూపాయల అప్పులు చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
ఇప్పటి వరకూ అప్పులు...
విజన్ డాక్యుమెంట్ అంతా అబద్ధమేనని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. తమ హయాంలో రెవెన్యూ పెరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకూ చంద్రబాబు లక్షా పన్నెండు వేల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. చివరకు ఆరోగ్య శ్రీని కూడా ఎత్తివేసే ఆలోచన చేయడం దారుణమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రైతులకు ఇంత వరకూ పెట్టుబడి సాయం అందచేయకుండా కాలం వెళ్లబుచ్చుతున్నానని తెలిపారు. ఈ అప్పులు ఎవరు కట్టాలి? ఈ రాష్ట్రం ఎటు పోతుందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. హామీలు అమలు చేయకపోతే తానే ప్రశ్నిస్తానని చెప్పిన కూటమి నేత ఎటు పోయారని బుగ్గన పరోక్షంగా పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now