పోస్టల్ బ్యాలట్ పై నేడు తీర్పు
పోస్టల్ బ్యాలట్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పనుంది. సాయంత్రం ఆరు గంటలకు తీర్పు వెలువడనుంది.
పోస్టల్ బ్యాలట్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పనుంది. సాయంత్రం ఆరు గంటలకు తీర్పు వెలువడనుంది. దీంతో పోస్టల్ బ్యాలట్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ పార్టీల్లో నెలకొంది. పోస్టల్ బ్యాలట్ పత్రాలపై గజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకుని కౌంటింగ్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఎక్కడా లేని విధంగా...
అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి మినహాయింపులు ఎందుకంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలను నిన్న హైకోర్టు ధర్మాసనం వినింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు తీర్పు వెలువడనుంది.