హైకోర్టులో నేడు రాజధాని వివాదం
రాజధాని రైతులు వేసిన కోర్టు థిక్కార పిటీషన్లపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది
రాజధాని రైతులు వేసిన కోర్టు థిక్కార పిటీషన్లపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని అమరావతిలో మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతుల తరుపున న్యాయవాదులు కోర్టు థిక్కార పిటీషన్లు వేశారు.
కోర్టు థిక్కారం....
ఈ పిటీషన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ లు విచారించనున్నారు. గతంలో రాజధాని అమరావతి భూముల విషయంలో స్టేటస్ రిపోర్ట్ ను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక సీఆర్డీఏ ఇటీవల రాజధాని భూముల అమ్మకాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ పై కూడా రైతుల తరుపున న్యాయవాదులు పిటీషన్ వేయనున్నారు.