Balineni : నేడు బాలినేని పిటీషన్ పై తుది తీర్పు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి వేసిన కేసుపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తుది తీర్పు వెల్లడి కానుంది

Update: 2024-10-28 02:30 GMT

balineni srinivas 

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి వేసిన కేసుపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తుది తీర్పు వెల్లడి కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంలలో అక్రమాలు జరిగాయంటూ బాలినేని హైకోర్టును ఆశ్రయించారు. ఒంగోలులోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను తిరిగి లెక్కించాలని, వీవీ ప్యాట్ లను కూడా కలిపి లెక్కించాలని కోరారు.

ఈవీఎంలకు సంబంధించి...
దీనికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీన ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈరోజు బాలినేని శ్రీనివాసులు రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టులో తుది తీర్పు వెల్లడి కానుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇదే సమయంలో పిల్ వేసినప్పుడు బాలినేని వైసీపీలో ఉండగా, ఈరోజు ఆయన కూటమిలోని జనసేనలో ఉండటం విశేషం.


Tags:    

Similar News