ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

షెడ్యూల్ ప్రకారం.. మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4 రకూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.;

Update: 2022-12-26 14:55 GMT
intermediate exams, march, government, andhra pradesh

ap inter exams

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సోమవారం సాయంత్రం ఏపీ ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ను విడుల చేసింది. దీని ప్రకారం.. 2023 మార్చ్ 15వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4 రకూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలన్నీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించబడతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఏప్రిల్ 15 నుండి 25 వరకూ మొదటి గ్రూప్, ఏప్రిల్ 30 నుండి మే 10 వరకూ రెండవ గ్రూప్ కు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.



 


Tags:    

Similar News