వారికి మంత్రి ఆదిమూలపు డెడ్ లైన్

చెరువులకు పడిన గండ్లు పూడ్చకపోతే తాను చెరువులోకి దూకుతానని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు

Update: 2021-12-20 02:14 GMT

చెరువులకు పడిన గండ్లు పూడ్చకపోతే తాను చెరువులోకి దూకుతానని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలోని పుల్లల చెరువు, చిన్న కండలేరు చెరువులకు గండ్లు పడ్డాయి. వాటిని అధికారులు పూడ్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గండ్లు పూడ్చకపోతే...
చెరువులకు పడిన గండ్లు వెంటనే పూడ్చకపోతే తాను చెరువులోకి దూకుతానని బెదిరించారు. గండిపడిన రెండు రోజులయినా ఎందుకు పూడ్చలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. ఈరోజు వరకు అధికారులకు సమయం ఇచ్చారు. నేటి మధ్యాహ్నానికి గండ్లు పూడ్చకపోతే తాను చెరువులోకి దిగి మరమ్మత్తులు చేయాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు.


Tags:    

Similar News