Nara Lokesh : ఉప ముఖ్యమంత్రి పదవిపై తొలిసారి స్పందించిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవిపై తొలిసారి స్పందించారు;

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవిపై తొలిసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ తనకు చంద్రబాబు అప్పగించిన బాధ్యతలతో బిజీగా ఉన్నానని అన్నారు. దావోస్ నుంచి ఏపీకి అధికంగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తనకు ప్రస్తుతం చేతినిండా పని ఉందని, అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందన్న లోకేష్ తనపై అనేక బాధ్యతలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఆలోచన కూడా లేదు...
గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపనతో పనిచేసుకుంటూ వెళుతున్నానని, ప్రధానంగా తనకు అప్పగించిన విద్యాశాఖలో ఎన్నోమార్పులు, సంస్కరణలను కూడా తేవాలని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అందుకే ఇతర అంశాలపై తాను దృష్టి పెట్టే అవకాశం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చి లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళడమే తన ముందున్న కర్తవ్యమని, అంతకు మించి మరొకటి ఉండదని కూడా నారా లోకేష్ అన్నారు. దాని గురించి ఆలోచించే సమయం కూడా తన వద్ద లేని మీడియాతో అన్నారు.