పొలం పనుల్లో మంత్రి నిమ్మల
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పొలం పనులు చేసి కాసేపు ఉల్లాసంగా గడిపారు;
ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ తమకు నచ్చిన పనులు చేయడం కొందరి వల్లనే సాధ్యమవుతుంది. అందరూ చేయలేరు. అవకాశమున్నప్పటికీ తమ కోరికలను మనుసులోనే అణిచివేసుకుంటారు. మరికొందరు మాత్రం తమ మనసులో ఉన్న వాటిని అమలు చేసేంత వరకూ నిద్రపోరు. అలాంటి వారిలో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఒకరు. నిమ్మల రామానాయుడు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నిత్యం బిజీగా ఉంటారు. ఎప్పుడూ సమీక్షలు, టూర్లతో ఆయనకు సమయం ఇట్టే తెలియకుండానే గడిచిపోతుంది.
తొలి నుంచి పొలం పనులంటే...
కానీ నిమ్మల రామానాయుడుకు తొలి నుంచి పొలం పనులు అంటే ఇష్టం. ఆయన అధ్యాపకుడిగా పనిచేసిన రోజుల్లోనూ తనకున్న వ్యవసాయ భూమిని సాగు చేసేందుకు ఆయన స్వయంగా నడుంబిగిస్తారు. తాజాగా నిమ్మల రామానాయుడు సంక్రాంతికి సెలవు దొరకడంతో ఒకింత తన మనసును పొలం పనులు చేసి తేలిక పర్చాలనుకున్నారు. తన స్వగ్రామమైన అగర్తిపాలెంలో ఉన్న పొలంలోకి వెళ్లి వరికి పిచికారీ ఆయనే స్వయంగా చేశారు. తన పొలంలోకి అడుగుపెడితే అదొకరకమైన తృప్తి అని అంటున్నారు నిమ్మల రామానాయుడు. గ్రేటే కదా?