Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే.. సమీక్షలు ఈ శాఖలపై
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు నాయుడు జీఎస్డీపీపై సమీక్షను నిర్వహించనున్నారు.
వివిధ శాఖలపై సమీక్షలు...
అనంతరం ఉదయం 11.30 గంటలకు ఆదాయం సమకూర్చి పెట్టే శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వివిధ శాఖల అధికారులు, మంత్రులతో ఆయన సమావేశమై ఏఏ రూపంలో ఆదాయం తేవాలన్న దానిపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళతారు.