Chandrababu : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. విద్యుత్తు ఛార్జీలపై?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను పెంచబోమని ఆయన తెలిపారు. చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనల పై ఏపీఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజల అభిప్రాయాలకు విలువనిస్తూ...ప్రజలపై విద్యుత్ ధరల భారం పడకుండా రూ.14,683 కోట్ల డిస్కంల రెవిన్యూ లోటును భరించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది.
వ్యవసాయానికి...
అదే సమయంలో వ్యవసాయానికి పగటిపూట రోజుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఆక్వా వంటి వివిధ రంగాలకు రాయితీ విద్యుత్, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు నిరంతరాయ విద్యుత్... ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ ల ఉచిత విద్యుత్ వంటి వాటికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.