బీమ్లా నాయక్ బిగుసుకు పోయారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. అల్లూరి విగ్రహావిష్కరణ సభ విజయవంతమయిందననారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ విజయవంతమయిందననారు. ఈ సభతో బీమ్లా నాయక్ బిగుసుకు పోయారన్నారు. చంద్రబాబు నీరుగారి పోయారని రోజా అన్నారు. సభకు వచ్చిన అశేష జనాన్ని చూసి ఇద్దరు నేతలు డంగై పోయారని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధితో పాటు ప్రతి సామాజికవర్గాన్ని ఆదుకుంటున్నారని తెలిపారు.
ప్రతి కుటుంబం...
జగన్ పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు. విపక్షాల విమర్శలను తాము పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. పసలేని వారి విమర్శలను ప్రజలు కూడా పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని రోజా అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని ఆర్కే రోజా అన్నారు. జగన్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మహిళలు, బడుగు వర్గాల వారే జగన్ కు వెన్నుదన్నుగా నిలవనున్నారని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.