ముగిసిన మంత్రి వర్గ సమావేశం... చర్చలకు కమిటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమాశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీని నియమించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమాశం ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి వర్గం ఆమోదించింది. దీంతో పాటు పలు ఆర్డినెన్స్ లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఉద్యోగుల అంశంపై కూడా చర్చ జరిగింది. ఈబీసీ పథకానికి, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం చెప్పింది.
మంత్రులతో పాటు....
ఉద్యోగుల ఆందోళనపై మంత్రి వర్గ సమావేశం చర్చించింది. అయితే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మలను నియమించారు. వీరు ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి నచ్చ చెప్పాలని ప్రభుత్వం భావిస్తుంది.