అనంతబాబు రిమాండ్ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబు కు మరో 14 రోజులు కోర్టు రిమాండ్ పొడిగించింది

Update: 2022-06-06 12:56 GMT

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబు కు మరో 14 రోజులు కోర్టు రిమాండ్ పొడిగించింది. అనంతబాబు రిమాండ్ గడవు ముగియడంతో ఈరోజు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశ పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అత్యంత భద్రత నడుమున అనంతబాబును కోర్టుకు తీసుకు వచ్చారు.

మరో 14 రోజులు...
కోర్టు మరో 14 రోజులు రిమాండ్ ను పొడిగించింది. అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనను పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ బహిష్కరించింది. అనంతబాబు ఈ నెల 20 వతేదీ వరకూ రిమాండ్ లో ఉంటారు. పోలీసులు కస్టడీ పిటీషన్ వేయకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News