రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రబలతీర్థం శకటం

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికయింది. ప్రబల తీర్థం శకటాన్ని హస్తినలో ప్రదర్శించనున్నారు

Update: 2023-01-23 03:02 GMT

ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికయింది. కోనసీమ ప్రాంతంలోని ప్రబల తీర్థం శకటాన్ని హస్తినలో ప్రదర్శించనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైళ్లను ఈ సారి రిపబ్లిక్ వేడుకల్లో ప్రదర్శిస్తున్నారు. రిహార్సల్స్ ఇప్పటికే పలువురిని ఆకట్టుకుంటున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఈసారి ప్రత్యేకత...
రిపబ్లిక్ వేడుకలలో ఈసారి శకటాల ప్రదర్శనకు దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులకు అవకాశం కల్పించారు. ఏపీ నుంచి కోనసీమ ప్రబలతీర్థం శకటాన్ని ప్రదర్శించనున్నారు. సంక్రాంతి పండగ సమయంలో కనుమ రోజు జరిగే ప్రబలతీర్థం ను శకటంగా రూపొందించి ప్రదర్శిస్తున్నాను. జగ్గన్న తోటలో ప్రతి కనుమకు జరిగే ఈ ప్రబలతీర్థానికి విశిష్టత ఉంది. మొత్తం 17 రాష్ట్రాల శకటాలు ఈ వేడుకల్లో ప్రదర్శిస్తున్నారు. అందులో ఏపీ నుంచి ప్రబలతీర్థం ఒకటి కావడం విశేషం


Tags:    

Similar News