నేడు స్పీకర్ ఎదుటకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు
స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఆఖరి అవకాశమిచ్చారు. తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని కోరారు
స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఆఖరి అవకాశమిచ్చారు. తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. టీడీపీ నుంచి వైసీపీలోకి, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు పూర్తి కావడంతో ఈరోజు నేరుగా అసెంబ్లీ కార్యాలయంలోని తన ఛాంబర్ కు వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కోరింది.
ఎనిమిది మంది...
వైసీపీలో గెలిచి టీడీపీలోకి మారిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు టీడీపీ నుంచి వైసీపీకి మద్దతిచ్చిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ కుమార్ లకు కూడా నోటీసులు జారీ చేశారు. వీరిలో మేకపాటి, ఉండవల్లి తమకు ఆరోగ్యం బాగా లేదని స్పీకర్ కార్యాలయానికి సమాచారం పంపినట్లు తెలిసింది. అలాగే మద్దాలిగిరి తాను విదేశీ పర్యటనలో ఉన్నారని తెలియజేశారు. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఉత్కంఠగా మారింది.