ముర్ము అందరికీ ఆదర్శం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసన్మానం ఘనంగా నిర్వహించింది.

Update: 2022-12-04 08:28 GMT

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసన్మానం ఘనంగా నిర్వహించింది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతిని ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు స్వాగతం పలికారు. అనంతరం పోరంకిలోని ఒక కన్వెన్షన్ సెంటర్ లో ద్రౌపది ముర్మును సన్మానించారు. దేశ చరిత్రలోని ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం అందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

ఎన్నో పదవులను...
ద్రౌపది ముర్ము గతంలో అనేక పదవుల్లో రాణించారన్నారు. పదవులకే వన్నె తెచ్చిన ముర్మును ఏపీ ప్రభుత్వం తరుపున సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. సామాజికవేత్తగా, ప్రజాప్రతినిధిగా ద్రౌపది ముర్ము ఎన్నో సేవలు అందించారన్నారు. ప్రతి ఒక్క మహిళకు ఆమె స్పూర్తిదాయకమని జగన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.


Tags:    

Similar News