అదే రోజు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తాం: చంద్రబాబు
ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇప్పటి నుంచి ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని టీడీపీ ప్లాన్..
ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇప్పటి నుంచి ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని టీడీపీ ప్లాన్ వేస్తోంది. ఎలాగైన సరే మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. రకరకాల వ్యూహాలు రచిస్తోంది. ఇక దసరా రోజున తమ మెనిఫేస్టోను విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అది కూడా మహిళల సమక్షంలో ఉంటుందని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు విషయాలను వెళ్లడించారు. మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, మేనిఫెస్టోలోనూ మహిళల అభ్యుతన్నతి కోసం తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఆడ బిడ్డలకు అండగా ఉంటాం..
ఆడబిడ్డలకు అండగా ఉంటామన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పేరతో పెళ్లి కానుక ఇచ్చింది తమ పార్టీ అని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలు కష్టపడకూడదనే ఉద్దేశంతో దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చామని, మహళల భవిష్యత్‌కు మహాశక్తి పథకం తోడ్పుతుందని చంద్రరబాబు అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తామన్నారు. విజయదశమి రోజున మహిళల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.
మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. రాబోయే రోజుల్లో కరెంట్ చార్జీలు పెంచమని స్పష్టం చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు చేస్తామన్నారు. తాము అధికారం చేపట్టగానే తల్లికి వందనం పేరుతో పిల్లలందరి చదువుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏటా 15 వేల రూపాయలు ఇస్తామని అన్నారు. అలాగే పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని అవసరమైతే మరో సిలిండర్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ప్రస్తుత మన వద్ద ఉన్నవాటితో ధనికుడు మరింత ధనికుడిగా మారుతున్నాడని.. పేదవాడు మరింత పేదరికంలోకి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదటి విడత మేనిఫెస్టో ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.