టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారని.. వారికి ఇబ్బంది కలగకూడదనే మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు బొత్స.
మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12గం.45ని. వరకు పరీక్షల సమయాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.