Anganwadi : అంగన్ వాడీ వర్కర్ల సమ్మె విరమణ.. పది డిమాండ్లకు ఓకే
ఆంధ్రప్రదేశ్ లో అంగన్‌వాడీ వర్కర్లు తాము చేేస్తున్న సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో అంగన్‌వాడీ వర్కర్లు తాము చేేస్తున్న సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి విధుల్లోకి హాజరవుతామని అంగన్‌వాడీ వర్కర్లు తెలిపారు. అంగన్ వాడీ కార్యకర్తలు మొత్తం పదకొండు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచగా అందులో పది డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది అందుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే మొత్తాన్ని కూడా పెంచింది. మరణించిన వారి కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వడానికి అంగీకరించింది.
నేటి నుంచి విధుల్లోకి...
వచ్చే జులై నుంచి వేతనాల పెంపుకు హామీ ఇచ్చింది. సమ్మెకాలంలో వేతనాలు ఇస్తామని, పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో అంగన్ వాడీలు గత కొద్ది రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. నేటి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. ఈచర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. నిన్న హాజరుకాని అంగన్ వాడీ కార్మికులను విధుల నుంచి తొలగించి కొత్తవారి ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.