చిక్కిన మరో చిరుత

తిరుమల కాలినడక మార్గంలో మరో చిరుత బోనుకు చిక్కింది

Update: 2023-09-20 03:05 GMT

తిరుమల కాలిబాటలో వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉంది. ప్రధానంగా చిరుతలు, ఎలుగుబంట్లతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాలినడకన స్వామి వారిని చేరుకోవాలనుకున్న భక్తులపై చిరుతలు దాడి చేస్తున్న ఘటనలు అనేకం చూశాం. ఈ ఘటనలో ఒక చిన్నారి ప్రాణాలు కూడా కోల్పోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భక్తులకు కర్రలు ఇవ్వడంతో పాటు రాత్రి వేళ చిన్నారులను ఆ మార్గంలో ప్రయాణించడంపై నిషేధం విధించింది.

అక్కడే బోనులో...
గుంపులు గుంపులుగానే వెళ్లేలా, వారికి ఒక సెక్యురిటీ గార్డును కూడా కేటాయించింది. అయితే తాజాగా తిరుమలలో మరో చిరుత బోనులో పడింది. గత వారం రోజుల నుంచి ఈ చిరుత సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే బోను ఏర్పాటు చేశారు. చివరకు ఆ బోనులోనే చిరుత చిక్కింది. ఆ చిరుతను జూపార్కుకు తరలించనున్నారు. అక్కడ లక్షిత మీద దాడి చేసిన చిరుతా? లేదా? అన్నది పరీక్షించనున్నారు.


Tags:    

Similar News