ఆళ్లగడ్డలో మరో రగడ.. భూమా వర్ధంతి సభలో ట్విస్ట్
ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో మరో వివాదం చెలరేగింది;
ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో వివాదం చెలరేగింది. భూమా నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా తన సొంత స్థలంలో నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విగ్రహాలను బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు వర్థంతి సందర్భంగా ఆ విగ్రహాలను భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి వచ్చి ఆవిష్కరించారు. పాలాభిషేకం కూడా చేశారు.
అసహనం వ్యక్తం చేసిన....
దీంతో కిషోర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. భూమా కుటుంబ సభ్యుడిగా తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను వారు ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. గత కొంత కాలంగా భూమా కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి. అఖిలప్రియ వైఖరి నచ్చక భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఆయన వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తుండటంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలిసింది.