తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత

ఇటీవల తిరుమలలో నడక మార్గంలో చిరుత దాడిలో బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతోరంగంలోకి దిగిన టీటీటీ, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు..

Update: 2023-08-17 06:45 GMT

ఇటీవల తిరుమలలో నడక మార్గంలో చిరుత దాడిలో బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతోరంగంలోకి దిగిన టీటీటీ, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు చిరుతను ఎట్టికేలకు బోనులో బంధించారు. చిరుత సంచారంతో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ నేపథ్యంలో తిరుమల నడకదారిలో బోనులో మరో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కిన చిరుత చిక్కినట్లు అధికారులు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ చిరుత లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో బోనులో చిక్కింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు బోనులో చిక్కాయి. అయితే ఇటీవల బాలుడిపై దాడి చేసి విడిచి పెట్టగా, మరో బాలికపై దాడి చేసి చంపేసింది.

ఇలా వరుస దాడుల నేపథ్యంలో నాలుగు ప్రాంతాల్లో చిరుత కోసం బోనులను ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు నిఘా పెట్టిన అధికారులు.. చిరుతలను బంధించే పనిలో ఉన్నారు. అంతేకాకుండా భక్తుల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భక్తులకు చిరుతల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. తిరుమల నడకదారి మార్గంలో ప్రతి చోట పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసింది టీటీడీ. మిగిలిన చిరుతలను పట్టుకునేందుకు మొత్తం ౩౩ బోనులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది అటవీశాఖ. ఏదీ ఏమైనా అతి తొందరలోనే చిరులను పట్టుకుంటామంటున్నారు అధికారులు.

ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతల కదలికలను గుర్తిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. చిరుతల దాడుల నేపథ్యంలో తిరుమల వెంకన్న నడక మార్గంలో సమయ వేళలు పాటిస్తున్నారు. భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లతో కూడిన గుంపులు ఉంటే అనుమతించడం లేదు. భక్తులకు కర్రలు సైతం అందజేస్తోంది టీటీడీ. చిరుత దాడి చేసినప్పటి నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు నిఘా పెడుతూ భక్తులకు భద్రత కల్పిస్తున్నారు.

Tags:    

Similar News